• Login / Register
  • జ‌న‌ర‌ల్ న్యూస్‌

    UPI Pay Ments | 11 నెలల్లో రూ.223 లక్షల కోట్ల పేమెంట్స్..!

    UPI Pay Ments | 11 నెలల్లో రూ.223 లక్షల కోట్ల పేమెంట్స్..!
    యూపీఐ చెల్లింపుల్లో మైలురాయి చేరిన లావాదేవీలు 
    Hyderabad : భార‌త దేశంలో యూపీఐ  (Unified Payments Interface)  లావాదేవీల్లో కీలక మైలురాయి న‌మోఐంది. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ నెలాఖరు వరకూ 15,547 కోట్ల లావాదేవీలు జరిగితే అందులో రూ.223 లక్షల కోట్ల చెల్లింపులు యూపీఐ జరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ శనివారం ‘ఎక్స్’ వేదికలో పోస్ట్ చేసింది. ‘భారత్ ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ పేమెంట్ విప్లవం దిశగా ప్రయాణిస్తోంది. 2024 జనవరి - నవంబర్ మధ్య 15,547 కోట్ల లావాదేవీల్లో రూ.223 లక్షల కోట్ల చెల్లింపులు జరిగాయి. ఇది భారత్ ఆర్థిక ప‌రిస్థితుల‌పై ప్రభావం చూపుతుంది’ అని పేర్కొంది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా కూడా యూపీఐ పేమెంట్స్‌కు ప్రాముఖ్యత పెరుగుతున్నదని పేర్కొన్న‌ది. 
    ప్రస్తుతం ఏడు దేశాల్లో యూపీఐ లావాదేవీలు జోరుగా సాగుతున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్ దేశాల్లోనూ యూపీఐ చెల్లింపులు జోరుమీద ఉన్నాయి. ఇది భారత్‌లో పెరిగిపోతున్న డిజిటల్ పేమెంట్స్ ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది. మొబైల్ ఫోన్ల ద్వారా వ్యక్తులు, వ్యాపారుల మధ్య రియల్ టైం లావాదేవీల దిశగా డిజిటల్ చెల్లింపుల పరివర్తన సాగుతోంది. 2015లో ఆర్బీఐ మద్దతుతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రారంభించారు. యూఐడీఏఐ చైర్మన్, ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నందన్ నిలేకని సారథ్యంలోని  కమిటీ.. దేశంలో సమర్ధవంతమైన డిజిటల్ చెల్లింపుల ఫ్రేమ్ వర్క్ స్థాపించాలని ప్రతిపాదించింది. తదనుగుణంగా యూపీఐ ఏర్పాటు జరిగింది.
    *  *   *

    Leave A Comment